కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ క్షమాపణలు చెప్పారు. ఆయన నటించిన తాజా చిత్రం విక్రాంత్ రోణ ఈ నెల 28న విడుదల కానుంది. ప్రమోషన్స్ నేపథ్యంలో నేడు హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్‌మీట్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ క్రమంలో మీడియా ప్రతినిథులకు కిచ్చా సుదీప్ క్షమాపణలు చెప్పారు. అనారోగ్య కారణాలతో ప్రెస్‌మీట్లకు హాజరు కాలేకపోతున్నానని, క్షమించాలని కోరారు.