ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సోఫాలో అతడేం చేశాడో బయటపెట్టేసిందిగా

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 15, 2018, 09:19 AM

వినాయక చవితి సందర్భంగా బిగ్ బాస్ హౌస్ సందడిగా మారింది. ర్యాప్ సింగర్ రోల్ రైడా పాడిన ‘శంకర్ కా బేటా’ అనే గణేష్ సాంగ్‌తో హోరెత్తించారు. ఇక శుక్రవారం నాటి 97వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ రూల్స్‌ని అతిక్రమించినందున దీప్తికి విధించిన జైలు శిక్షను నేటితో ముగింపు పలికారు. ఇకపైనైనా బిగ్ బాస్ రూల్స్‌ని సక్రమంగా ఫాలో కావాలని హెచ్చరించారు బిగ్ బాస్. గురువారం నాటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌కి గీతా మాధురి భర్త నందు రావడం.. సామ్రాట్‌తో క్లోజ్ నెస్‌పై ఇద్దరి మధ్య చర్చ జరగడం లాంటి విషయాల్ని దీప్తితో చర్చించింది గీతా మాధురి. ఈ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యా అని.. కౌశల్ హౌస్‌లో తన గురించి ఇలా మాట్లాడటం వల్లే ఇలా జరిగిందా అర్ధం కాలేదన్నారు. సామ్రాట్‌కి రాఖీ కూడా కట్టా. నేను రాఖీ కడుతుంటే మమ్మా.. అని పిలుస్తాడు సామ్రాట్ నన్ను. నేను అందరితో గేమ్ ఆడా.. గణేష్‌తో కూడా గేమ్ ఆడా. కాని కేవలం సామ్రాట్‌తో ఆడిన గేమ్‌ని మాత్రమే ప్లే చేస్తే నేను ఏం చేయాలి. రోల్ రైడా, అమిత్ భయ్యాలతో కూడా పేంపరింగ్ చేశా. 


 


అంతెందుకు నా వేలు తీసుకుని అమిత్ నోట్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తూ నేను సామ్రాట్‌తో చేసింది చిన్నదిగానే కనిపిస్తుంది. ఇదొక్కటీ చూస్తే అలానే అనిపిస్తుంది. కౌశల్ అయినా ఇదొక్కటే ఎలా చూస్తారు. మీరు (దీప్తి, శ్యామల) నాతో మాట్లాడింది కూడా అమిత్, సామ్రాట్, తనీష్‌ అందర్నీ కలిపి మాట్లాడారు. అయినా గీత ఛాయిస్ ఎప్పుడూ రాంగ్ కాదని నందూకి ఉంది. మా క్లారిటీ మాకు ఉంది. కాని కౌశల్ వల్లే ఇదంటా క్రియేట్ అయ్యిందనేది నా డౌట్’ అంటూ తన ఇమేజ్‌కి డ్యామేజ్ కలిగించిన విషయంపై మరోసారి చర్చ నడిపింది గీతా మాధురి. 


 


అనంతరం సామ్రాట్ దగ్గరకే వెళ్లి.. నీ చేయి బాలేదు కదా నేను బెడ్ షీట్స్ సర్దుతా నీ రెస్ట్ తీసుకో.. ఇదిగో ఈ సోఫాలో కూర్చో.. నీ ఫేవరేట్ సోఫాలో కూర్చో.. ఈ మధ్య ఈ సోఫాను బొత్తిగా మర్చిపోయారు. ఇక్కడ కూర్చునే వారు కదా అంటూ సామ్రాట్, తేజస్వినితో సోఫా కూర్చుని గడిపిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. దీనికి హర్ట్ అయిపోయిన సామ్రాట్‌ని హలో హలో.. అంటూ తనదైన హస్కీ గొంతుతో పిలిస్తే.. హలో కాస్తా.. హ లవ్ అని అమిత్‌కి వినబడటం దాన్ని అమిత్.. హ లవ్ అని రిపీట్‌లో వినిపిస్తే.. గీతా మాధురి జరిగిన డ్యామేజ్ చాలు అన్నట్టు దన్నం పెట్టి సామ్రాట్‌ను బుజ్జగించే ప్రయత్నం చేసింది. 


 


ఇది కాస్తా ఓవర్‌గా అనిపించినప్పటికీ అలవాటు చేసుకున్న గీత అస్సలు తగ్గలేదు. ఈ సోఫా అంటే నాకు చాలా ఇష్టం.. నేను కూర్చుంటా అని అదే సోఫాలో సెటిల్ అయ్యింది. కూర్చోండి అక్కడే బావుంటుంది అని సామ్రాట్ అంటే.. ఎందుకు బావుంటుంది? అని తిరిగి అడగటం... మెత్తగా ఉంటుందని డబుల్ మీనింగ్‌లో రోల్ రైడా ఆన్సర్ చేయడం. నేను ఫ్రెండ్ లా భావిస్తుంటే తలకెక్కి కూర్చోవడం అంటే ఇదే అని గీతకు సామ్రాట్ మొట్టికాయలేయడాన్ని బట్టి సోఫా వెనుక పెద్ద కథే నడిచినట్టు ప్రేక్షకులకు చెప్పకనే చెప్పింది గీతా మాధురి. 


 


ఇక వినాయక చవితి వేడుక కోసం బిగ్ బాస్ హౌస్‌కి బయట నుండి పిల్లలు రావడం.. కొత్త కొత్త పిండి వంటలతో బిగ్ బాస్ హౌస్‌లో పండగ వాతావరణం నెలకొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa