నాచురల్ స్టార్ నాని తొలిసారి నటిస్తున్న పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ మరియు నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా "దసరా". కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఫుల్ మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, దసరాలో అద్దిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటుగా హీరోహీరోయిన్ల మధ్య అమేజింగ్ అండ్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట. గతంలో నాని, కీర్తి కలిసి నటించిన "నేను లోకల్" సినిమాలో కూడా బలమైన ప్రేమ కధాంశం ఉంటుంది. అదే ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపింది. ఇప్పుడు దసరా లో కూడా అంతకు మించిన బలమైన ప్రేమకథ ఉంటుందని, దీనికి తోడు ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో నాని ఒక పేద యువకుడిగా, కీర్తి సంపన్న కుటుంబ వారసురాలిగా నటిస్తుందని అంటున్నారు. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.