శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన "థాంక్యూ" ఇటీవల థియేటర్లలో విడుదలై ఎంతటి డిజాస్టర్ కలెక్షన్లను రాబడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైతు హిట్ ట్రాక్ కు సడెన్ బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా. అలానే దిల్ రాజు కు కూడా గట్టి షాక్ ఇచ్చింది. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు.
గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి వీకెండ్ కే క్లిజింగ్ కొచ్చేసింది. ఇంతటి భారీ డిజాస్టర్ ను ముందుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. థాంక్యూ డిజిటల్ హక్కులను కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని ముందస్తు స్ట్రీమింగ్ చేసేందుకు ససేమిరా ఒప్పుకోవట్లేదట. ఒక చిత్రాన్ని అనుకున్న సమయానికన్నా ముందుగా డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తే, సదరు నిర్మాతలకు ఆ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కొంతమొత్తాన్ని ముట్టజెప్తుంది. ఇలా అయినా థాంక్యూ నష్టాలని కొంతవరకు పూడ్చుకుందామనుకున్న దిల్ రాజు ఆశలను అమెజాన్ పూర్తిగా నీరు గార్చింది. అంటే, థాంక్యూ నెల తరవాతనే ఓటిటి లోకొస్తుందన్న మాట.