డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో థాయిలాండ్ యాడ్ షూట్ తదుపరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మరొక యాడ్ షూట్ చేస్తున్నాడని తెలిసిందే కదా. ఈ మేరకు షూటింగ్ లొకేషన్ లో మాటల మాంత్రికుడితో ముచ్చటిస్తున్న బన్నీ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బన్నీ రెండు వెరైటీ గెటప్స్ లో, రెండు డిఫరెంట్ ఔట్ ఫిట్లలో కనిపిస్తున్నారు. ఈ రెండు లుక్స్ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి.
ఈ యాడ్ పై లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ యాడ్ ని డైరెక్ట్ చేసినందుకు త్రివిక్రమ్ దాదాపు అరకోటి ఆర్జిస్తున్నాడంట. స్క్రిప్టెడ్ యాడ్ ని చిత్రీకరించేందుకు, కేవలం యాక్షన్, కట్ చెప్పినందుకు త్రివిక్రమ్ ఇంత భారీ మొత్తాన్ని అందుకోవడం చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది.