నందమూరి కళ్యాణ్ రామ్ తన తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన అనుబంధం ఎలా ఉంటుందో తొలిసారి ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త చిత్రం "బింబిసార" ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తో తనకున్న బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పారు. తారక్, తనకు మధ్యన గొప్ప సాన్నిహిత్యం ఉందని, బింబిసారుడిగా నటించాలంటే ముందు తనకు చాలా భయం వేసిందని, తారక్ తనను వెన్నంటి నడిపించాడని, బింబిసార ఫస్ట్ లుక్ కూడా ముందుగా తారక్ కే చూపించానని చెప్పారు. ఏ ప్రాజెక్ట్ తన వద్దకు వచ్చినా ముందుగా తారక్ తో సంప్రదిస్తానని, తారక్ తన బౌన్సింగ్ బోర్డు అని, నిర్మొహమాటంగా రివ్యూ ఇస్తాడని చెప్పారు.
ఇక, వశిష్ట్ డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతుంది.