నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన కొత్త చిత్రం "బింబిసార". ఆగస్టు 5న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరై, తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కు గట్టి సపోర్ట్ ఇచ్చారు. అంతేకాక, బింబిసార ప్రీ ప్రొడక్షన్ పనుల నుండి షూటింగ్ పూర్తయ్యేంత వరకు తారక్ వెన్నుదన్నుగా నిలిచారు.
లేటెస్ట్ గా బింబిసార ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్, నందమూరి బాలకృష్ణ తో ఒక స్పెషల్ షో చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. తారక్ సపోర్ట్ తో అంచనాలు రెట్టింపైన బింబిసారకు బాలయ్య కూడా తన సపోర్ట్ ఇవ్వబోతుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఐతే, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.