చందు మొండేటి డైరెక్షన్లో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు.
జూలై 22 నుండి ఆగస్టు 12కి, ఆ తరవాత 13కి ...ఇలా వరస వాయిదాలు పడిన కార్తికేయ 2 విడుదల తేదీ పట్ల నిఖిల్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏమైనా ఇండస్ట్రీ బాగుకోసమే అని సరిపెట్టుకున్న విషయం కూడా తెలిసిందే. లేటెస్ట్ గా నిఖిల్ ఈ సినిమాను ఆగస్టు 13 కన్నా ముందుగానే కొన్నిచోట్ల స్పెషల్ స్క్రీనింగ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. ఐతే ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa