కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది హెబ్బా పటేల్. తన అందాల వేడితో సిల్వర్ స్క్రీన్‌ని వేడెక్కించి కుర్రకారు గుండెల్లో చోటు సంపాదించింది. యూత్‌ని అట్రాక్ట్ చేసి సొగసుల గాలం వేసింది. దీంతో ఈ అమ్మడికి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. తొలి సినిమాతో వచ్చిన గుర్తింపుతో అమ్మడి క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత హెబ్బాకు వరస ఆఫర్లు వచ్చినప్పటికీ పెద్దగా హిట్ పడింది మాత్రం లేదు. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించినా కూడా హెబ్బాకు కావాల్సిన రేంజ్ ఇమేజ్ అయితే రాలేదు.
కాకపోతే హెబ్బా అంటే అబ్బో అనేలా హాట్ బ్యూటీగా తన ప్రత్యేకత చాటుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏ మాత్రం అవకాశం దొరికినా అందాలనే ఎరగా వేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. గ్లామర్ పరంగా యువతకు పిచ్చెక్కించేలా సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తోంది హెబ్బా. కుర్రకారు కలల రాణిలా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందాల వడ్డన కానిస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసి నెట్టింట మంట పెట్టింది హెబ్బా పటేల్. శారీలో పరేషాన్ లుక్స్‌తో కెమెరాకు పోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.కుమారి లుక్ అదుర్స్, బక్కచిక్కిన బబ్లీ బ్యూటీ, శారీలో సూపర్ హాట్ అంటూ ఈ ఫోటోలపై తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.