ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైజ్ జీరో కోసం అస్ట్రియాకు వెళ్లిన అనుష్క

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 10, 2018, 02:57 PM

ఒక సినిమా కోసం బరువు పెరిగి ఆ తరువాత బరువు తగ్గించుకోవడం నానా ఇబ్బందులు పడుతున్న‌ది టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క‌. ‘సైజ్ జీరో’ సినిమా కోసం బరువు పెరిగి ఆ తరువాత తగ్గడానికి చాలా కష్టపడింది. అందుకే బాహుబలి2, సింగం౩ వంటి సినిమాలలో లావుగా కనిపించిందనే విమర్శలు వినిపించాయి. ఆమె ఆఖరిగా నటించింది ‘భాగమతి’ సినిమాలో.. ఈ సినిమా తరువాత అనుష్క ఇప్పటివరకు మరే సినిమా సైన్ చేయలేదు. బరువు తగ్గడం కోసం డైటింగ్, వర్కవుట్లు చేసింది. దీనికారణంగా ఆమెకి బ్యాక్ పెయిన్ వచ్చింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆమె కేరళలో స్పా థెరపీ కూడా తీసుకుంది.. అయినా బొద్దు మాత్రం త‌గ్గ‌లేదు..బరువు కార‌ణంగానే సాహో మూవీ ఛాన్స్ ను కూడా వ‌దులుకోవ‌ల‌సి వ‌చ్చింది.. బ‌రువు త‌గ్గ‌డం కోసం దేశవ్యాప్తంగా ఎన్నో హెల్త్ సెంటర్స్ తిరిగి ప్రయత్నాలు చేసినా ఫ‌లితం మాత్రం రాలేదు.. ఏది వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. సహజసిద్ధమైన పద్దతుల ద్వారానే బరువు తగ్గాలని భావిస్తోన్న అనుష్కకి కొందరు ఆస్ట్రియా వెళ్లమని సలహా ఇచ్చారట. అక్కడ బరువు తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన వైద్యం ఉంటుందని సూచించడంతో ఇటీవల అనుష్క ఆస్ట్రియా వెళ్లింది..అక్క‌డే రెండు నెల‌ల పాటు ఉండి కొత్త అనుష్క‌లా మారి తిరిగిరానుంద‌ని టాక్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa