నందమూరి కళ్యాణ్ రామ్ "బింబిసార" ఇటీవల విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఎంత పెద్ద హిట్టో మ్యూజిక్ ఆల్బం కూడా అంతే హిట్ అయ్యింది. చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి చిరంతన్ భట్ స్వరపరిచిన "గులేబకావళి" అనే సాంగ్ ను లిరికల్ వెర్షన్ లో ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఇదొక ఐటెం సాంగ్. ఆఫ్ఘానిస్తాన్ అమ్మాయి వారిన హుస్సేన్ ఈ సాంగ్ లో ఆడిపాడింది.