ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..."సలార్" అప్డేట్ కి డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 13, 2022, 02:47 PM

దేశవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ అప్డేట్ కి తాజాగా మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు మధ్యాహ్నం 12:58 నిమిషాలకు సలార్ నుండి బిగ్ అప్డేట్ ఒకటి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చెయ్యబోతుందని కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఐతే, ఈ అప్డేట్ దేనికి సంబంధించినదై ఉంటుందన్న విషయం మాత్రం మేకర్స్ సస్పెన్స్ లో ఉంచారు.
"కేజీఎఫ్" తో దేశవ్యాప్త సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఆ ఫ్రాంచైజీ తదుపరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేస్తున్న చిత్రమిది. కేజీఎఫ్ నిర్మాత, హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదుర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com