కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, ఉళగనాయగన్ కమల్ హాసన్ చాలా చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగు పెట్టారు. కమల్ కు 67 ఏళ్ళు ఐతే, ఆయన సినీ ప్రస్థానానికి 63 ఏళ్ళు. అంటే నాలుగేళ్ళ ప్రాయంలోనే కమల్ తొలి సినిమా "కలాతూర్ కన్నమ్మ" లో నటించి, రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు.
ఈ 63 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణంలో కమల్ కేవలం నటుడిగానే కాక, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా, పాటల రచయితగా, స్క్రీన్ రైటర్ గా, మేకప్ ఆర్టిస్ట్ గా తనలోని విభిన్న ప్రత్యేకతలను ప్రేక్షకులకు చాటి చెప్పి, వారి మనసులో తిరుగులేని స్థానాన్ని సంపాదించాడు. ఈమధ్యనే కమల్ రాజకీయనాయకుడిగా కూడా మారి, ప్రజాసేవ చేస్తున్నారు.
కమల్ తొలి సినిమా "కలాతూర్ కన్నమ్మ" విడుదలై నిన్నటితో 63 ఏళ్ళు. ఈ సందర్భంగా ప్రేక్షకులు, సినీప్రముఖులు సోషల్ మీడియాలో కమల్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.