ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. అందంగా కోసం రకరకాల ప్రొడక్ట్స్, ఖరీదైన క్రీములు, ఉత్పత్తులు వాడుతుంటారు. ఇంకొందరు ముఖానికి మెరుపు ఇవ్వడానికి మేకప్ వాడుతుంటారు. అయితే, అసలైన అందం ఇలాంటి ప్రొడక్ట్స్, క్రీములు, మేకప్ నుంచి రాదు. బదులుగా శరీరం యొక్క అంతర్గత ఫిట్‌నెస్ నుంచి వస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్ల సాయంతో ఆరోగ్యం మాత్రమే కాదు.. మెరిసే చర్మం, పొడవాటి జుట్టును కూడా సొంతం చేసుకోవచ్చు.
అంతేకాకుండా కొన్ని ప్రత్యేక ఆసనాలు, ముద్రలు మీ అందాన్ని మరింత పెంచడంలో సాయపడతాయి. అలాంటి ఓ ముద్ర గురించి నటి, ఒకప్పటి హీరోయిన్ డైసీ బోపన్న తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. డైసీ బోపన్న రవితేజ చంటి సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అంతేకాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. ఆమె తన ముడతల్లేని అందమైన చర్మం వెనక ఉన్న సీక్రెట్‌ను పంచుకున్నారు. ఇంతకీ నటి చెప్పిన ముద్ర ఏంటి, ఎలా చేయాలన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డైసీ బోపన్న తన అనుభవాన్ని షేర్ చేసుకుంది
నటి డైసీ బోపన్న తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఐదేళ్ల నుంచి ఒక ముద్ర చేయడం ద్వారా చర్మం, జుట్టు మాత్రమే కాకుండా, ఆమె కోల్పోయిన కళ్ల మెరుపు ఎలా తిరిగి వచ్చిందో చెప్పింది. ఈ ముద్ర రోజూ వేయడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముఖంపై ఫైన్ లైన్,ముడతల్ని తగ్గించడంలో సాయపడుతుంది. చర్మం యువ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఆ ముద్ర ఏంటో యోని - కాకి ముద్ర. ఈ ముద్రను ఎలా చేయాలో కూడా వివరించింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చుద్దాం.
యోని - కాకి ముద్ర ఎలా చేయాలి?
నటి డైసీ బోపన్న మాట్లాడుతూ.. ముందుగా నాలుకను పెదవుల నుంచి కొద్దిగా బయటికి తీసుకురావాలి. దీన్ని పైపులాగా వచ్చేలా చూసుకోండి. వీడియోలో ఈ ముద్రను నటి డైసీ బోపన్న చూపించింది.
ఇప్పుడు మీ శ్వాసను బంధించి.. నోరు బెలూన్‌లాగా ఊదండి.
ఇప్పుడు రెండు బొటనవేళ్లను ముక్కుకు ఇరువైపులా ఉంచి.. రెండు చేతుల వేళ్లను కలిపి ఉంచండి. మీ తలను దించుకుని శ్వాసను గట్టిగా పీల్చి బంధించండి.
ఈ పొజిషన్‌లో వీలైనంత సేపు ఉండండి. తర్వాత మీ బొటనవేలును ముక్కు నుంచి తీసి.. ముక్కు ద్వారా గాలిని వదలండి. తిరిగి మాములు పొజిషన్‌కు రండి.
ఈ ముద్రను ఎలా చేయాలో నటి డైసీ బోపన్న తన ఇన్‌స్టా వీడియోలో చూపించారు.
నటి చెప్పిన ముద్ర ఏంటో చూడండి
ఈ ముద్ర ఎలా పనిచేస్తుంది?
ఈ భంగిమ వెనుక ఉన్న శాస్త్రాన్ని కూడా నటి వివరించింది. మీ నోటిలోకి గాలిని ఊదడం వల్ల ముఖం యొక్క మృదువైన కండరాలు సాగుతాయి. ఇది ముఖ నరాలను ప్రేరేపిస్తాయి. ఈ ప్రక్రియ ముడతల్ని తగ్గించడానికి సాయపడుతుంది. అంతేకాకుండా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది.
ఇది చర్మ మసాజ్ కంటే ప్రభావవంతమైన మార్గం. ఇది అంతర్గత నాడీ కండరాల ఉద్దీపన యొక్క ఒక రూపం అని నటి వెల్లడించారు. ఒత్తిడి రక్త నాళాలు బిగుతుగా మారడానికి కారణమవుతుంది. ఈ భంగిమ చేయడం వల్ల నాళాలు సడలించబడతాయి. మైక్రో సర్క్యులేషన్ పెరుగుతుంది.
ముఖంతో పాటు జుట్టుకు మేలు
ఈ ముద్ర ముఖంలోని ప్రతి భాగానికి రక్త సరఫరాతో పాటు ఆక్సిజన్ అందేలా చేస్తుంది. దీంతో పాటు ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తింటే.. రక్త ప్రసరణ ముఖ కణాల్ని చేరుకోవడానికి, వాటికి పోషణను అందించడానికి సాయపడుతుంది. అంతేకాకుండా శోషరస పారుదలని మెరుగుపర్చడానికి సాయపడుతుంది.
ఇది ముఖంపై ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫైన్ లైన్స్‌ను తొలగించడానికి సాయపడుతుంది. ఈ భంగిమ కార్టిసాల్ హార్మోన్‌ని విచ్చిన్నం చేస్తుంది. సహజ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో మెరిసే చర్మంతో పాటు పొడవాటి కురులు మీ సొంతం అవుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
ఈ ముద్రను ఎంతసేపు చేయాలి?
సరైన పోషకాహారం, జీవనశైలి పాటిస్తే.. ఈ ముద్ర ఉత్తం యాంటీ ఏజింగ్ ఆసనంగా పనిచేస్తుంది. ఇది చర్మ వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది. ప్రారంభంలో ఈ ఆసనాన్ని మూడు నిమిషాలు సాధన చేసేదాన్ని అని నటి వివరించారు. ఇప్పుడు అది పది నిమిషాలకు పెరిగిందని నటి వివరించారు. అయితే, ప్రతి ఒక్కరూ తమ శరీర సామర్థ్యాన్ని బట్టి ఈ ఆసనానికి సమయ పరిమితి నిర్ణయించుకోవాలని ఆమె సలహా ఇస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆసనం సాధనం చేయడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa