ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"వాంటెడ్ పండుగాడ్" లిరికల్ థీమ్ సాంగ్ ఔట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 05:38 PM

కొంచెం సేపటి క్రితమే "వాంటెడ్ పండుగాడ్" మూవీ నుండి థీమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. కథా నేపధ్యాన్ని మొత్తం ఈ పాటతో  ప్రేక్షకులకు తెలియచేసినట్టు ఉంది. ఈ పాటను అపర్ణ నందన్, మనోజ్ ఆలపించగా, శ్రీధర్ సీపాన, PR సాహిత్యమందించారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సాయిబాబా కోవెలమూడి, వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీధర్ సీపాన డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
సునీల్, అనసూయ భరద్వాజ్, సుధీర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa