ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తికేయ 2 హిందీ షోలకు విశేష స్పందన

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 06:08 PM

నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందూ మొండేటి డైరెక్షన్లో మిస్టికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం "కార్తికేయ 2". పాన్ ఇండియా భాషల్లో శనివారం విడుదలైన ఈ చిత్రం అన్నిచోట్లా హిట్ టాక్ ను సొంతo చేసుకుని హౌజ్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
విశేషమేంటంటే, కార్తికేయ 2 హిందీలో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తొలి రోజు తక్కువ షోలతో  రూ. 7లక్షలు సంపాదించిన ఈ సినిమా, రెండవరోజు మరిన్ని షోలతో రూ. 28 లక్షలు, ఇక మూడవరోజు ఇంకా ఎక్కువ షోలతో ఏకంగా కోటి పది లక్షలు సంపాదించి, మంచి సినిమా ఎక్కడైనా, ఎప్పుడు రిలీజైనా ఘనవిజయం సాధిస్తుందని నిరూపించింది. దీంతో కార్తికేయ 2 ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని క్లియర్ గా తెలుస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa