యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తమన్నా జంటగా నటించిన చిత్రం "గుర్తుందా శీతాకాలం". కరోనా మరియు ఇతరత్రా కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కాబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఇప్పటికే ఈ మూవీ నుండి పాటలు, ట్రైలర్ విడుదలయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్ డైరెక్ట్ చేసారు. కాలభైరవ సంగీతం అందించారు. మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సుహాసిని మణిరత్నం కీలకపాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa