ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నార్త్ బెల్ట్ లో సైలెంట్ హిట్స్ ఇచ్చిన బన్నీ, నిఖిల్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 06:35 PM

సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా, రెడ్ శాండల్ స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం "పుష్ప". ఇక్కడి పరిస్థితి పక్కన పెడితే, ఈ సినిమా హిందీలో ఊరమాస్ హిట్ కొట్టింది. ఎలాంటి ప్రమోషన్స్ చెయ్యకుండానే నార్త్ బెల్ట్ లో వంద కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది.
అదే రీతిలో తాజాగా విడుదలైన నిఖిల్ సిద్దార్ధ్ "కార్తికేయ 2" కూడా ఉత్తరాదిన ఫుల్ హవా చూపిస్తుంది. కార్తికేయ 2 టీం కూడా హిందీలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలను ఇప్పటి వరకు చెయ్యలేదు. కానీ, హిందీలో ఈ సినిమాకొస్తున్న రెస్పాన్స్ మాములుగా లేదు. కలెక్షన్లయితే రోజురోజుకు ఏమాత్రం పోలిక లేకుండా పెరిగిపోతున్నాయి. తొలి రోజు 7లక్షలు సంపాదించిన ఈ సినిమా మూడో రోజు కోటి రూపాయలు సంపాదించిందంటే, ఉత్తరాది జనాలు ఈ సినిమాను ఎంతలా ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa