మాస్ హీరోగా విశాల్ కథానాయకుడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పందెంకోడి 2’. వీరిద్దరి కలయికలో 13 సంవత్సరాల క్రితం వచ్చిన ‘పందెంకోడి’ విశాల్ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. మళ్ళీ విశాల్, లింగుస్వామి కాంబినేషన్‌లో వస్తోన్న ‘పందెంకోడి 2’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ‘పందెం కోడి 2’ మాస్ హీరో విశాల్‌కి 25వ సినిమా కావడం విశేషం. లైట్‌హౌస్ మూవీ మేకర్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ఈ నెల 18వ తేదిన ప్రేక్షకుల ముందుకురానున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీలోని చిచ్చుబుడ్డి పిల్లగాడా సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని శ్రీవర్ధిని, సెంథిల్ దాస్ ఆలపించారు.. యవన్ శంకర్ రాజా సంగీత సమకూర్చాడు.. తాజాగా విడుదలైన ఈ సాంగ్ ను మీరూ వినండి.
మాస్ హీరో విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాతలు: విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa