ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో లేటెస్ట్ గా ఒక స్పెషల్ ట్వీట్ చేసారు. దీంతోపాటు రీసెంట్ స్టైలిష్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను కూడా పోస్ట్ చేసారు. ఐకాన్ స్టార్ స్పెషల్ ట్వీట్ రీజన్ ఏంటంటే, ట్విట్టర్ లో బన్నీ 7మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అందుకనే ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్తూ ఈ స్పెషల్ ట్వీట్ చేసారు.
పుష్ప పాన్ ఇండియా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ, వరస వెకేషన్లకెళ్తూ ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తున్న బన్నీ ఈ మధ్యనే ప్రొఫెషనల్ పనులను స్టార్ట్ చేసి కొన్ని యాడ్ లకు సంబంధించిన షూటింగ్ లలో పాల్గొన్నారు.