వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కృష్ణమ్మ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది. ఈరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని మూవీ టీమ్ ఈ సినిమా నుండి ఒక మధురమైన లిరికల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ సాంగ్ ని సిద్ శ్రీరామ్ పడగా, కాల భైరవ లిరికల్ ట్యూన్స్ సమకూర్చారు. ఈ సినిమాని సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa