ప్రతి ఒక్కరూ వాళ్లను వాళ్లు అంగీకరించుకుంటే సంతోషంగా ఉన్నట్లే. మనమెలా ఉన్నామో…అలా ఉన్నందుకు ఆనందపడాలి. అంటోంది బాలీవుడ్ భామ సోనాక్షీ సిన్హా. ఫ్యాషన్‌ను అనుసరించడం నాకు అలవాటు లేదు. వస్త్రాలంకరణపై ఏకాగ్రత పెద్దగా ఉండదు. అయితే నేను వేసుకునే దుస్తులే ప్రత్యేకంగా ఉంటాయని చెప్పుకుంటోంది. తన అందం, ఆలోచనలపై ఇటీవల సోనాక్షీ మాట్లాడుతూ..నా కాస్ట్యూమ్స్ అబ్బాయిల దుస్తుల్లా ఉండటం ఓ స్టైల్ అనుకుంటారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా బాలీవుడ్ లోకి వచ్చిన నేను ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాషన్ వీక్‌లలో పాల్గొనడం గర్వంగా ఉంది. బాలీవుడ్ నాయికలకు అద్భుతమైన సమయమిది. నాయిక ప్రధాన చిత్రాలు ఎక్కువగా రూపొందిస్తున్నారు. నేనూ అలాంటి చిత్రాల్లో భాగమవడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తీరిక లేకుండా కెరీర్ కొనసాగుతోంది. ఈ ప్రయాణమే అన్ని విషయాలను నేర్పిస్తోంది. ప్రతి ఒక్కరూ వాళ్లను వాళ్లు అంగీకరించుకుంటే సంతోషంగా ఉన్నట్లే. మనమెలా ఉన్నామో…అలా ఉన్నందుకు ఆనందపడాలి. నేను పని చేస్తున్నా..అది పనిలా భావించను. అదొక ఇష్టమైన అలవాటు అనుకుంటా. అందువల్ల ఎంత సేపు షూటింగ్‌లో పాల్గొన్నా…అలసట అనిపించదు. పనిని ప్రేమించాలి. దాంతో పాటు కుటుంబానికి, స్నేహితులకు సమయం కేటాయించాలి. వృత్తినీ, వ్యక్తిగత జీవితాన్ని సమతూకం చేసుకుంటే ఎవరైనా సంతోషంగా ఉండొచ్చు. అని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa