కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ "జైలర్". నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ నిన్నటి నుండే ప్రారంభమైంది.
ఈ సినిమాలో రజినీకి జోడిగా మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో తమన్నా ఫుల్ లెంగ్త్ రోల్ లో కాదుగాని, స్పెషల్ గెస్ట్ రోల్ లో నటిస్తుందని, ఆ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. రజినీకాంత్ పై ఉన్న అభిమానం, ఒక లెజెండరీ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే తమన్నా ఈ రోల్ చెయ్యడానికి ఒప్పుకుందని టాక్. మరైతే, ఈ సినిమాలో తమన్నా నటిస్తుందా అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.
అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీరోల్ లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa