లక్ష్మి రాధామోహన్ ప్రెజెంట్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ లో నిర్వమించారు సంపత్ నంది దర్శకత్వంలో నిర్మాత కేకే రాధామోహన్ తెరకెక్కిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఈ సినిమా ఒక జీవిత సంఘటనల ఆధారంగా. 2002లో ఓదెల అనే గ్రామంలో జరిగిన వరుస హత్యలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించి ఈ క్రైమ్ థ్రిలర్ ‘ఆహా’ ఓటీటీ వేదికగా 26వ తేదీన శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. కొత్తగా పెళ్లై, శోభనం జరిగిన మహిళలను మాటు వేసి హతమార్చిన ఓ సైకో కిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక నిమిషం 47 సెకన్ల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నవ వధువులను అత్యాచారం చేసిన హతమార్చుతున్న సైకో కిల్లర్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అన్న సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ, వశిష్ట, సాయి రోనక్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాడు. ట్రైలర్‌ను గమనిస్తే సినిమా సహతత్వానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంపత్ నంది కథ అందించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించడం విశేషం. కొత్తగా పెళ్లైన మహిళలను హత్య చేస్తోన్న సైకో కిల్లర్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారా.? అసలు ఆ కిల్లర్ హత్యలు ఎందుకు చేశాడన్న వివరాలు తెలియాలంటే ఆహాలో విడుదలవుతోన్న సినిమాను చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa