ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RRR : తారక్ టైగర్ ఫైట్ సీన్ VFX వీడియో వైరల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 05:32 PM

భారతదేశ ప్రజలు గర్వించదగ్గ మూవీ RRR. ఎస్. ఎస్ రాజమౌళి డైరెక్షన్లో యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలకపాత్రలు పోషించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు.
ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను థ్రిల్ చేసే విజువల్ వండర్ గా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ గ్రాఫిక్స్ కోసం దేశవిదేశాల సాంకేతిక నిపుణులతో రాత్రి పగలు కష్టపడి మరి పని చేసారు.
తాజాగా ఈ మూవీ నుండి ఒక VFX వీడియో విడుదలైంది. అదే, తారక్, టైగర్ ల ఫైట్ సీన్. ఈ సీన్ కోసం రాజమౌళి అండ్ టీం ఎంత కష్టపడ్డారు, స్క్రీన్ పై చూపించేందుకు ఎన్ని తంటాలు పడ్డారన్నది ఈ వీడియో చూస్తే క్లియర్ గా అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa