ఈరోజుల్లో మొదటి సినిమా ఎవరి కెరీర్‌నైనా తేల్చేస్తుందని అంటారు. అయితే అదే మొదటి సినిమా ఘన విజయం సాధించినప్పటికీ అవకాశాలను చేజిక్కించుకోవడంలో కొందరు నటీనటులు వెనుకబడి ఉంటారు. ఇప్పుడు పాయల్ రాజ్‌పుట్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదని అంటున్నారు. ఆ మధ్య వచ్చిన ఆర్.ఎక్స్.100 చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించిన ఆమెకు ఆ తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలపై అవకాశాలు వచ్చేస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అవకాశాలను దక్కించుకోవడంలో మాత్రం ఆమె వెనుబడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి అవకాశాలే ఆమె దరి చేరలేదా? లేక స్క్రిప్టుల ఎంపికలో తానే ఆచితూచి అడుగులేస్తోందా? తెలియాల్సి ఉంది.
తెలుగులో భానుశంకర్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో ఆమెకు అవకాశం లభించింది. ఇదిలావుండగా…తమిళంలో మాత్రం ఆమెను ఓ అవకాశం వరించింది. ఉదయనిధిస్టాలిన్ కథానాయకుడిగా రూపొందబోయే చిత్రంలో పాయల్ నటించబోతోంది. తనకు తమిళంలో తొలి అవకాశం రావడం పట్ల ఆమె ఆనందాన్ని వ్యక్తంచేస్తూ…తెలుగు ప్రేక్షకుల మాదిరిగానే తమిళ ప్రేక్షకులు తనను ఆదరిస్తారన్న నమ్మకం ఉందని సోషల్‌మీడియాలో పేర్కొంది. ఏదిఏమైనా తెలుగులో మంచి కాంబినేషన్‌లో అవకాశాలు ఎప్పుడొస్తాయా? ఆ దశ ఎప్పుడు తిరుగుతుందా? అని ఆమె వేయికళ్లతో ఎదురుచూస్తోంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa