టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "నేను మీకు బాగా కావాల్సినవాడిని". కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఫాదర్ సెంటిమెంట్, లవ్, యాక్షన్ ఇలా.. అన్నిరకాల కమర్షియల్ అండ్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఎక్జయిటింగ్ గా సాగింది. కిరణ్ మాస్ అవతార్, బాబా మాస్టర్, గెటప్ శీనుల కామెడీ ఎపిసోడ్స్, యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి. SR కళ్యాణమండపం తదుపరి మళ్ళీ అలాంటి సాలిడ్ హిట్ అందుకోవడానికి కిరణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో కిరణ్ కల నెరవేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.
శ్రీధర్ గాదె ఈ సినిమాకు దర్శకుడు కాగా, సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుంది. వెటరన్ డైరెక్టర్ SV కృష్ణారెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. పోతే, ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదల కాబోతుంది.