ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"యశోద" టీజర్ రిలీజ్ టైమింగ్లో మార్పు

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 05:50 PM

సమంత నటిస్తున్న తొలి బహుభాషా చిత్రం "యశోద" మేకర్స్ కొంచెంసేపటి క్రితం బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, అనుకున్న సమయానికన్నా ముందుగానే యశోద టీజర్ విడుదల కాబోతుందని అధికారికంగా తెలిపారు. రేపు సాయంత్రం విడుదల కావాల్సిన టీజర్ మధ్యాహ్నం 02:34 నిమిషాలకు విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు.
హరి శంకర్, హరీష్ నారాయణ్ ల ద్వయం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావురమేష్, మురళీశర్మ, సంపత్ రాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa