యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య 'కృష్ణ బృందా విహారి' అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, కృష్ణ బృందా విహారి ట్రైలర్‌ను సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలిజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని రివీల్ చేసారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa