తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఆగస్టు ఐదవ తేదీన విడుదలైన సీతారామం సినిమా ప్రేక్షకుల చేత విశేషంగా ఆదరింపబడింది. అద్భుతమైన థియేటర్ రన్ ను, అమేజింగ్ డిజిటల్ రన్ ను ఒకేసారి సక్సెస్ఫుల్ గా జరుపుకుంటున్న ఈ మూవీ విడుదలైన ఆరోవారంలో కూడా రికార్డులు నమోదు చేస్తుంది.
లేటెస్ట్ గా 14 లొకేషన్లను కలుపుకుని మొత్తంగా ఓవర్సీస్ లో 36 లొకేషన్లలో ప్రదర్షింపబడుతుంది ఈ సినిమా. ఆరవ వారంలో ఇలా న్యూ లొకేషన్స్ ఒక సినిమాకు యాడ్ అవ్వడం నిజంగా ఒక రికార్డే.
హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa