'సీతారామం' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న హీరో దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'కెరీర్ ప్రారంభంలో నా సినిమాల రివ్యూలు చదువుతుంటే బాధేసేది. నా నటనను విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్స్ చేసేవారు. నాకు యాక్టింగ్ రాదని, నేను సినిమాలు ఆపేస్తే మంచిదని, నా తండ్రిలా నేను నటుడిగా రాణించలేనని.. యాక్టర్ గా పనికిరానన్నారు. ఆ వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి' అని దుల్కర్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |