దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయమవుతున్న చిత్రం "అహింస". విభిన్న చిత్రాల దర్శకుడు తేజ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, గీతికా హీరోయిన్ గా నటిస్తుంది.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇకపై ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సినిమా నుండి ఫస్ట్ లిరికల్ "నీతోనే నీతోనే" అనే పాటను రేపు సాయంత్రం నాలుగింటికి విడుదల చెయ్యబోతున్నట్టు కొంచెంసేపటి క్రితమే అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. RP పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa