నాగశౌర్య, బాలీవుడ్ నటి మరియు గాయకురాలు షెర్లీసెటియా జంటగా నటించిన చిత్రం "కృష్ణ వ్రింద విహారి". ఈ రోజే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేసారు. అనీష్ ఆర్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 23న ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం మేకర్స్ ప్రమోషన్స్ ను చాలా భారీగానే జరుపుతున్నారు.
ఇప్పవాటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా నాగశౌర్య కెరీర్ కు ఏ మేరకు ఉపయోగపడుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa