మలయాళీ హీరోయిన్ సానియా అయ్యప్పన్, నటి గ్రేస్ ఆంటోనీలకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం కోజికోడ్ మాల్ లో జరిగిన 'సాటర్ డే నైట్' ప్రమోషన్ ఈవెంట్ కి వీరిద్దరూ హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ కు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. దీంతో సెక్యూరిటీ వారిని అదుపుచేయలేకపోయారు. హీరో, హీరోయిన్స్ బయటకు వెళ్తుండగా, సానియా, గ్రేస్ తో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఒంటిపై చేయి వేయడంతో సానియా అతడి చెంప పగులకొట్టింది. ఈ వీడియో వైరల్ గా మారింది.