గిరీశాయ డైరెక్షన్ లో వచ్చిన 'రంగ రంగ వైభవంగా' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ నెల 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ లో అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ నెట్ ఫ్లిక్స్ ఓ పోస్టర్ విడుదల చేసింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com