ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న అంశం ఊబకాయం. అధిక బరువు కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవడమే కాకుండా శరీర ఆకృతి కూడా పాడవుతుంది. ఇక, చాలా మంది కొవ్వు పేరుకుపోవడం వల్ల బరువు పెరుగుతారు. అయితే, కొన్నిసార్లు శరీర బరువు పెరగడానికి కొవ్వు కారణం కాదు. శరీరంలో నీరు నిలుపుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు.
శరీర కణజాలాలలో ద్రవం పేరుకుపోయినప్పుడు నీరు నిలుపుకోవడం జరుగుతుంది. దీనివల్ల శరీరంలోని కొన్ని భాగాలలో వాపు వస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే మీరు బరువు పెరగడానికి అసలు కారణమేంటో తెలుసుకోవాలి. బరువు పెరగడానికి కారణం నీరు నిలుపుదలా లేదా కొవ్వా అని తెలుసుకోవాలి.
రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యమని న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ కోచ్ జిగ్యాసా చెబుతున్నారు. దీనిపై తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సమాచారాన్ని కూడా షేర్ చేసుకున్నారు. రెండింటి మధ్య తేడాను గుర్తించడానికి అనేక మార్గాల్ని వివరించారు. నీరు నిలుపుదల, శరీర కొవ్వు మధ్య తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో నీరు నిలుపుదల ఉందని ఎలా తెలుసుకోవాలి?
మీ శరీరంలో ద్రవాలు పేరుకుపోతున్నాయో లేదో తెలుసుకోవడానికి చాలా సులభమైన మార్గం ఉందని ఫిట్నెస్ కోచ్ చెబుతున్నారు. దీనిని ఒక సాధారణ శారీరక పరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చు.
నీటి నిలుపుదల ఉంటే.. అది త్వరగా తగ్గిపోతుంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల నీటి నిలుదలను తగ్గించుకోవచ్చని జిగ్యాసా చెబుతున్నారు.
మీ శరీరంలో నీరు పేరుకుపోతే.. అకస్మాత్తుగా బరువు పెరగడాన్ని గమనించవచ్చు. మీ మణికట్టు బిగుసుకుపోతుంది. మీరు ఉబ్బినట్టు భావిస్తారు.
నీటి నిలుపుదలని గుర్తించడానికి సులభమైన మార్గం ఉంది. మీ చీలమండలపై లేదా పాదాలు, మోకాళ్ల మధ్య ఎముకపై చేతివేళ్లతో ఒత్తండి. కొంతసేపు తర్వాత వేలి గుర్తులు కనిపించి మాయమైతే.. ఇది నీటి నిలుపుదలకు సంకేతమని ఎక్స్పర్ట్ చెబుతున్నారు.
నీటి నిలుపుదలకు కారణాలు
శరీరంలో నీరు నిలుపుదలకు అనేక కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే..
అధికంగా ఉప్పు తీసుకోవడం
హార్మోన్ల మార్పులు
నిద్ర లేకపోవడం
ఒత్తిడి, వాపు
మహిళల్లో నీటి నిలుపుదలకు హార్మోన్ల మార్పులు ప్రధాన కారణాలు
ఫిట్నెస్ కోచ్ ఏం చెప్పారంటే
నీటి నిలుపుదలను ఎలా వదిలించుకోవాలి?
ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించుకోండి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ప్రాసెస్, ప్యాకేజ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండండి. వీటిలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నీటి నిలుపుదలకు కారణమవుతాయి.
తగినంత నీరు తాగండి. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది లీటర్ల నీరు తాగండి. దీంతో, కిడ్నీలు నీటి నిలుపుదలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
రోజూ వ్యాయామం చేయండి. శారీరక శ్రమ లేకపోతే శరీరంలో నీరు నిలుపుదల పెరిగిపోతుంది. అందుకే రోజుకు కనీసం ముప్పై నిమిషాలైనా వ్యాయామం చేయండి. కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాలైనా బ్రిస్క్ వాకింగ్ చేయండి.
శరీరంలో ఉంది కొవ్వు అని ఎలా గుర్తించాలి?
శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. మీరు ఒక వారం తర్వాత బరువు పెరుగుతారు. నీటి నిలుపుదల వల్ల బరువు చాలా ఫాస్ట్‌గా పెరుగుతారు. కొవ్వు పేరుకుపోతే.. నిదానంగా బరువు పెరుగుతారు.
బట్టలు టైట్‌గా మారడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా బెల్లీ, తుంటి, తొడల్లో కొవ్వు పేరుకుపోతుంది. వీటిని కరిగించడం చాలా కష్టం.
ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తినడం వల్ల.. శారీరక శ్రమ చేయకపోతే అవి బర్న్ కావు. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.
కొవ్వును ఎలా తగ్గించుకోవాలి?
శరీరంలో కొవ్వు తగ్గాలంటే ముందు కేలరీలు తగ్గించుకోవాలి. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి. సమతుల్య ఆహారాన్ని మీ జీవనశైలిలో భాగం చేసుకోండి.
తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, విత్తనాలు, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు వంటివి భాగం చేసుకోండి.
రోజుకు కనీసం ముప్పై నిమిషాలైనా వ్యాయామం చేయండి. కార్డియో వ్యాయామాలు, ఏరోబిక్ వ్యాయామాల్ని భాగం చేసుకోండి.
వాకింగ్ చేయడం కూడా చాలా ముఖ్యం. బ్రిస్క్ వాకింగ్ చేయండి. రోజుకు కనీసం 8 వేల నుంచి 10 వేల అడుగులు నడవండి.
ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్లు పెరుగుతాయి. దీంతో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే యోగా, ప్రాణాయమం వంటివి లైఫ్స్టైల్లో యాడ్ చేసుకోండి. తగినంత నిద్ర కూడా చాలా ముఖ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa