ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టర్కీలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసిన 'NBK107'

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 07:19 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ 'NBK107' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాకి 'జై బాలయ్య' అనే టైటిల్‌ని లాక్ చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా టర్కీ షెడ్యూల్ పూర్తయిందని మూవీ టీమ్ త్వరలో హైదరాబాద్‌కు తిరిగి వస్తుందని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలయ్య, మోక్షజ్ఞ, గోపీచంద్ మరియు కుటుంబ సభ్యులతో కూడిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa