కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా "గాడ్ ఫాదర్". దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కావడానికి రెడీగా ఉంది.
నిన్ననే అనంతపురంలో ఈ మూవీ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ లోపే మేకర్స్ మరొక గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారని వినికిడి, అదికూడా దుబాయ్ లో అంట. గాడ్ ఫాదర్ సన్నిహితుడిగా నటించిన సల్మాన్ భాయ్ దుబాయ్ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారట. మరి, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa