అనుకున్నట్టుగానే మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం "జిన్నా" విడుదల తేదీ వాయిదా పడింది. ముందుగా అక్టోబర్ ఐదవ తేదీన ఈ మూవీ విడుదలవుతుందని అంతా అనుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది కూడాను. కానీ, జిన్నా మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన తెలుగు, మలయాళం, హిందీ భాషలలో విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు.
ఇందులో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇషాన్ సూర్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.