కార్తీ, రాశీఖన్నా జంటగా నటించిన "సర్దార్" మూవీ నుండి టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో కార్తీ ఒక ఇంటర్నేషనల్ స్పై క్యారెక్టర్ లో నటిస్తున్నారు. మొదట రెండు పాత్రల్లో కనిపిస్తారనుకున్నారంతా... కానీ, ఆరు విభిన్న గెటప్స్ లో కార్తీ కనిపించబోతున్నారని టీజర్ పక్కా క్లారిటీ ఇచ్చేసింది. ఈ ట్విస్ట్ తో సర్దార్ మూవీ పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. GV ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
PS మిత్రన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, రజీషా విజయన్ మరొక హీరోయిన్ గా నటిస్తుంది. ప్రిన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై S లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోతే, దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషలలో ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.