పల్లవి:
కలలో అయినా కలయికలో అయినా
కలిసుండని కాలాలైనా.. నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ.. ఎదుటే వున్నా
ఎదలోనే వున్నాఏ దూర తీరానున్నా..
నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ.. నాతోనే నాతోనే నువ్వెపుడూ.
చరణం: 1
నీ జతగా అడుగే పడగా.. ఆ క్షణమే కళ్యాణమే
నీ చెలిమే ముడులే పడగా.. ఆ చనువే మాంగల్యమే
నును లేతగ మునివేళ్ళు.. మెడ ఒంపున చేసేను
ఎన్నడు విడిపోనని వాగ్ధానమే...
నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ
చరణం 2:
నీ మనసే విరిసే కమలం
ఏ మలినం నిన్నంటదేనా
మనసే బిగిసే కవచం
ఏ సమయం నిను వీడదే
కోవెల శిథిలం అయినా
దేవత కలుషితమవదే
నమ్మవే నను నమ్మవే మా అమ్మవే