ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమా నుంచి శుక్రవారం ఉదయం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రభాస్ బాణం వేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది స్టన్నింగ్ పోస్టర్‌తో సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లిన మేకర్స్, దీనితో పాటు టీజర్ విడుదల సమయాన్ని కూడా లాక్ చేశారు. ఇక ఈ పోస్టర్ ను ఈరోజు ఉదయం 7:11 గంటలకు విడుదల చేయగా, ఎదురు చూస్తున్న టీజర్ ను అక్టోబర్ 2న సాయంత్రం 7:11 గంటలకు విడుదల చేస్తున్నట్టు క్రేజీ అప్డేట్ అందించారు. మొత్తానికి ఈ సెన్సేషనల్ టీజర్ ఎలాంటి విజువల్స్ తో ఉంటుందో చూడాలి.