2020లో విడుదలైన 'భానుమతి రామకృష్ణ' సినిమాతో మంచి అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు శ్రీకాంత్ నాగోతి. తాజాగా ఆయన డైరెక్షన్లో రాబోతున్న రెండవ చిత్రం "మంత్ ఆఫ్ మధు".
ఇందులో నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్నారు. నిన్న విడుదలైన ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అలానే కొంతమంది సినీ ప్రముఖుల నుండి విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ యూట్యూబు లో 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.
కృషివ్ ప్రొడక్షన్, హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్లపై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.