పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్" మూవీ నుండి ఫస్ట్ పోస్టర్ ఈ రోజే విడుదలైంది. రెండేళ్ల క్రితం విడుదలైన టైటిల్ పోస్టర్ తప్పించి, ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా నుండి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న ఫ్యాన్స్ తాజాగా విడుదలైన టీజర్ ఎనౌన్స్మెంట్ పోస్టర్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు.
పోతే, ఆదిపురుష్ టీజర్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో అక్టోబర్ రెండవ తేదీన రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాలకు విడుదల కాబోతుంది. ఈ మేరకు అయోధ్యలోని బ్యాంక్ ఆఫ్ సరయు లో మెగా ఈవెంట్ నిర్వహించబడుతుంది.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో సీతగా కృతి సనన్ నటిస్తుండగా, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి పాన్ ఇండియా భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది.