మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "జిన్నా". పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య డైరెక్షన్ చేస్తున్నారు.
ఇటీవలే విడుదల తేదీపై సాలిడ్ క్లారిటీ ఇచ్చిన జిన్నా మేకర్స్ లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ కు సన్నాహాలు మొదలెట్టారని వినికిడి. దసరా కానుకగా, అక్టోబర్ ఐదవ తేదీన జిన్నా ట్రైలర్ రాబోతుందని టాక్. ఈ విషయమై మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావలసి ఉంది.
అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళ భాషలలో అక్టోబర్ 21వ తేదీన విడుదల కాబోతుంది.