గరుడవేగా ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పర్ఫెక్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన మూవీ "ది ఘోస్ట్". ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించగా, సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను నమోదు చేసింది.
తాజాగా ఈ సినిమా తెలుగులోనే కాక తమిళంలోనూ విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఈ రోజే ఘోస్ట్ మూవీ తమిళ్ ట్రైలర్ విడుదలైంది.
తెలుగులో మంచి అంచనాల నడుమ అక్టోబర్ ఐదవ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా తమిళంలోనూ ఆ రోజే విడుదల కావడానికి రెడీ అవుతుంది. తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.