ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"నీతో" నుండి ఎమోషనల్ మెలోడీ లిరికల్ 'అందరాని' వీడియో ఔట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 04:17 PM

రాహు ఫేమ్ అభిరాం వర్మ నటిస్తున్న కొత్త చిత్రం "నీతో". ఈ సినిమాకు బాలు శర్మ దర్శకుడు కాగా సాత్వికా రాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.


వివాహానికి ఇన్సూరెన్స్ అనే విభిన్న కధాంశంతో, మోడరన్ డేస్ లో జరిగే ఒక కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ మూవీ, ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చెయ్యగలిగింది.


మిలియన్ డ్రీమ్స్, పృథ్వి క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లపై AVR స్వామి, కీర్తన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల కాబోతుంది. 


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'అందరాని ప్రేమ నీదా' అనే ఎమోషనల్ లిరికల్ వీడియో విడుదలైంది. ఈ పాటను గౌతమ్ భరద్వాజ్ ఆలపించగా, శ్రీనివాస మౌళి లిరిక్స్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com