వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం మణికర్ణిక. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథని అందించారు. క్రిష్ దర్శకత్వం వహించి కొంత భాగం పూర్తి చేశాడు.. అయితే అతడు ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో మణికర్ణిక పాత్రలో నటిస్తున్న కంగనా రనౌట్ దర్శకత్వ బాధ్యతలను స్వీకరించింది.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తికాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి 25వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 14వ తేదిన విడుదల చేయనున్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa