మంచు విష్ణు హీరోగా, కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య డైరెక్షన్లో రూపొందిన హార్రర్ కామెడీ యాక్షన్ ఎంటరైనర్ "జిన్నా". ఇందులో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు.
దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తుంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక హాట్ పెప్పి డాన్స్ నెంబర్ ను వీడియో రూపంలో విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు.
ఈ రోజు సాయంత్రం నాలుగింటికి మంచు విష్ణు, సన్నీ లియోన్ కలిసి డాన్స్ వేసే "జారు మిఠాయ" అనే వీడియో సాంగ్ విడుదల కానుంది.