నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా, సీనియర్ హీరో శ్రీకాంత్, కోలీవుడ్ నటుడు భరత్ నివాస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం "హంట్". ఇటీవలే మేకర్స్ ఈ మూవీ టీజర్ ను విడుదల చెయ్యగా, దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో మేకర్స్ ఈ మూవీ నుండి మరొక ప్రమోషనల్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో రేపు ఉదయం 10:04 నిమిషాలకు హంట్ ఫిస్ట్ లిరికల్ "పాపతో పైలం" అనే సాంగ్ విడుదల కానుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను ఈ రోజు సాయంత్రం 04:01 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాకు మహేష్ డైరెక్టర్ కాగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.